: ఎన్టీఆర్ తో సమానంగా రాణించిన నటుడు కాంతారావు: ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి


ఎన్టీఆర్ తో సమానంగా రాణించిన నటుడు కత్తి కాంతారావు అని ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి అన్నారు. కాంతారావు పేరిట నెలకొల్పిన అవార్డును ఆయన స్వీకరించారు. కాంతారావు 93వ జయంతి సందర్భంగా నల్లగొండ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక చిన వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ అవార్డును స్వీకరించిన అనంతరం జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, జానపద కథానాయకుడంటే ఆయనొక్కడేనని, 500కు పైగా సినిమాల్లో నటించిన కాంతారావు, తనదైన శైలిలో హీరోగా, విలన్ గా రాణించారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News