: అనంతపురం పోలీసులకు కృతఙ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్


జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అనంతపురం పోలీసులకు తన కృతఙ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశారు. అనంతపురంలో ఈరోజు నిర్వహించిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభ సజావుగా సాగడానికి, తన అభిమానులకు, ఈ సభకు హాజరైన వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లారన్నారు. ఈ సందర్భంగా అనంతపురం పోలీస్ శాఖాధికారులకు, సిబ్బందికి తన హృదయ పూర్వక ధన్యవాదాలు అని పవన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News