: గవర్నర్ ను కలిసిన కేసీఆర్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఆకాశ హర్మ్యాల నిర్మాణం, సమత బ్లాక్ కూల్చివేత, నూతన సచివాలయ నిర్మాణం వంటి అంశాలపై రెండు గంటలకుపైగా సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ఆర్బీఐ కొత్తనోట్లు ప్రవేశపెట్టడంపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు సీఎస్ రాజీవ్ శర్మ కూడా వున్నారు.