: రేపటి నుంచి ఏటీఎంలలో రూ.50 నోట్లను కూడా తీసుకోవచ్చు: ఆర్బీఐ ప్రకటన
అవినీతిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసి కొత్త నోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు బ్యాంకుల్లో కొందరు తమ నోట్లను మార్పిడి చేసుకోగా, మరికొందరు రేపటి నుంచి ఏటీఎంలలో అందుబాటులోకి రానున్న నోట్లను తీసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఈ రోజు బ్యాంకుల్లో కేవలం 2000 రూపాయల నోట్లను మాత్రమే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజలు చిల్లరలేక ఇబ్బందులు పడకుండా ఏటీఎంలలో రేపటి నుంచి రూ.50 నోట్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకు అధికారులు ప్రకటించారు.