: నాడు ట్రంప్ ను విమర్శించి, నేడు శుభాకాంక్షలు చెప్పిన రాజకుటుంబీకుడు
అమెరికా అధ్యక్ష బరిలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ పై నాడు విమర్శలు గుప్పించిన సౌదీ రాజకుటుంబీకుడు అల్వాలీద్ బిన్ తలాల్ నేడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బిన్ తలాల్ తన ట్విట్టర్ వేదికగా ట్రంప్ కు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని, ఆ పదవికి ఆయన తగిన వ్యక్తి కాదని, ట్రంప్ గెలవలేరంటూ బిన్ తలాల్ నాడు వ్యాఖ్యానించడం విదితమే.