: ప్రభుత్వాలు రాజకీయాలు, ఓట్ల మీదే దృష్టి పెడుతున్నాయి: ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుపోయిన విషయం తెలిసిందే. మాస్కులు వేసుకోకుండా జనాలు భయటకు వస్తే అనారోగ్యం పాలుకావాల్సిందే అన్నంతగా విపరీతంగా పెరిగిపోయిన కాలుష్యం పట్ల ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యంలో ఢిల్లీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందంటూ వ్యాఖ్యానించింది. చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన ఢిల్లీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకుండా ప్రభుత్వాలు రాజకీయాలు, ఓట్లు మీదే దృష్టి పెడుతున్నాయని వ్యాఖ్యానించింది.