: వాటి జోలికి వెళ్లొద్దంటూ కూతురుకి వార్నింగ్ ఇచ్చిన శ్రీదేవి!
ప్రముఖ నటి శ్రీదేవి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ల ముద్దుల కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అన్న సంగతి విదితమే. బాలీవుడ్ లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ, తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో చేసిన లిప్ కిస్ ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శిఖర్ తో జాన్వీ డేటింగ్ చేయడంపై కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి తన కూతురిని హెచ్చరించినట్లు, ఈ మేరకు ‘ముంబై మిర్రర్’ పత్రికలో ఒక కథనం వెలువడింది. బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్ వంటివే కాదు, కనీసం, యువకులతో స్నేహం చేసినా తాను ఒప్పుకోనని జాన్వీకి శ్రీదేవి గట్టిగా చెప్పిందని ఆ పత్రిక కథనం. కాగా, ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడే శిఖర్ పహరియా.