: శ్రుతిహాసన్ ను చంపేస్తానంటున్న వైద్యుడు... పోలీసులకు ఫిర్యాదు
ప్రముఖ నటి శ్రుతిహాసన్ ను కర్ణాటకకు చెందిన ఓ వైద్యుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్ణాటకకు చెందిన కేజీ గురుప్రసాద్ అనే వైద్యుడు సెప్టెంబర్ 7 నుంచి తన ట్విట్టర్ ఖాతాకు మెసేజ్ లు పెడుతూ, అసభ్యకరంగా తిడుతున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని తన ఏజెంట్ ప్రవీణ్ ఆంటోనీ ద్వారా చెన్నై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుకు అతను చేసిన ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి జతచేసింది. కాగా, గతంలో ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో ఉండగా, ఓ దుండగుడు దాడి చేశాడని ఆమె పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హాట్ కామెంట్స్ తో బాలీవుడ్ లో ఇమేజ్ పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న శ్రుతి హాసన్ 'బీ ద బిచ్' అనే షార్ట్ ఫిల్మ్ ను గత నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.