: కొత్త గెటప్.. కళ్లజోడు పెట్టుకున్న పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు అనంతపురంలో నిర్వహిస్తున్న సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో ఆయన కొత్త గెటప్ లో కనపడ్డారు. ముఖ్యంగా, ప్రసంగం మధ్యలో పవన్ కళ్లజోడు ధరించి కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ వివరాల ప్రతులను చదువుతూ.. తనకు సైటొచ్చిందంటూ చమత్కరించారు. అనంతరపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈ సభకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు.