: 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: పవన్ కల్యాణ్
రాయలసీమ పరిస్థితులు తనకు బాగా తెలుసని పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీమాంధ్రహక్కుల చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ... ‘ఏ ప్రాంతంలో ఏ కులంలో పుట్టానో నేను పట్టించుకోను. కులాలు, మతాలకు అతీతంగా నేను పోరాటం చేస్తాను. రాయలసీమ కరవు గురించి ఎలా పోరాటం చేయబోతున్నానో ఈ రోజు మాట్లాడతా. ముందు హోదా గురించి మాట్లాడతా’ అని అన్నారు. ‘స్పెషల్ ప్యాకేజీ గురించి చదివి నాకు సైటు కూడా వచ్చేసింది. ప్రత్యేక హోదాను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. మన సంపదని మన కష్టాన్ని బయటి వాళ్లకి ఇచ్చేసి మళ్లీ కొనుక్కుంటున్నామంటూ 1970లో ఓ వ్యక్తి రాసిన పుస్తకం నేను చదివాను. ఆ పరిస్థితులు ఇప్పటికీ ఎందుకు కొనసాగుతున్నాయి? మా మంచి తనంతో ప్రభుత్వాలు ఆడుకోకూడదు. మా అత్మగౌరవంతో మీరు ఆడుకోకండి. నా మొదటి జనసేన పార్టీ కార్యాలయం అనంతపురంలోనే ప్రారంభిస్తా. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. నాకు ఓట్లు వేయండి.. వెయ్యకపోండి. మీరు నాకు అండగా ఉన్నా లేకపోయినా నేను మీకు అండగా ఉంటాను’ అని పవన్ అన్నారు.