: కేంద్రాన్ని, రాష్ట్రాన్ని నిలదీస్తున్నా... వీటికి సమాధానాలు చెప్పండి: పవన్ కల్యాణ్


అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "స్పెషల్ ప్యాకేజీపై పుస్తకాలు చదివి చదివి నాకు సైటు వచ్చేసింది. అంటే కళ్లజోడు కేంద్రం వల్లే వచ్చింది. దీనికి కేంద్రం గ్రాంట్ విడుదల చేయాలి (నవ్వుతూ). పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్టు పోలవరం ప్రాజెక్టు...మూడు రకాల ప్రాజెక్టు. ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, 900 మెగావాట్ల విద్యుత్ తయారీకి, 5 లక్షల పైచిలుకు ప్రజలకు తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. అలా రూపొందించినప్పుడు దీని విలువ 16,000 కోట్ల రూపాయలు. దీనికి కేంద్రమిచ్చేది కేవలం ఇరిగేషన్ కు మాత్రమే. ఇరిగేషన్ విభాగానికి నూటికి నూరు శాతం ఇస్తాం అని కేంద్రం స్పష్టంగా చెప్పింది. దీనికి లెక్కలన్నీ వేస్తే కేవలం 8 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తారు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు ఎలా జాతీయ ప్రాజెక్టు అయిందో ప్రజలకు వివరణ ఇవ్వాలి. ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చామని, దానికి చట్టబద్దత కల్పించామని కేంద్రం పెద్దలు చెబుతున్నారు. దీనికి ఎలాంటి చట్టబద్ధత లేకుండా వెలువరించిన ప్రకటనకు, కేవలం కాగితాలకే పరిమితమైన ఈ ప్రకటనకు రెండున్నరేళ్లు పట్టింది. అలాంటప్పుడు వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలు పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? రాష్ట్రం వసతులు కల్పించలేదు కనుక మేమేమీ చేయలేమని చివర్లో చేతులెత్తేస్తారా? అనంతపురంలో పరిశ్రమలు ఎలా ఏర్పాటు చేస్తారు? కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు పరిశీలిస్తున్నామంటున్నారు. వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ప్రాజెక్టులు కార్యరూపం దాల్చుతున్నాయి. ఎలా? దీనికి కారణం ఏంటి?... ఎంతో మంది ప్రాణత్యాగం చేసిన తరువాత ఇస్తాం ఇస్తాం అని చెప్పి తెలంగాణను ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెడుతున్నారు. మేము వస్తువులం కాదు... కాలం గడిచే కొద్దీ మెత్తబడడానికి. మేము మనుషులం, కాలం గడిచేకొద్దీ గట్టిబడతాం. దీనిని తెగేవరకు తీసుకురావద్దు. అలా జరిగితే పరిణామాలు ఊహించలేరు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు. ఇక్కడున్న 14 ఏళ్ల పిల్లాడు తాతగా మారిన తరువాత ఇస్తారా? ఇది మీకు తప్పు అనిపించడం లేదా? మీరిలాగే చేస్తే 2019 ఎన్నికల్లో ఏం చేయాలో మాకు బాగా తెలుసు. మా భావావేశాలు, మా మంచితనం, మా ప్రాణాలు, ప్రయోజనాలతో మీరు ఆడుకోకండి అని హెచ్చరిస్తున్నాను. మా కోపాన్ని మీరు తట్టుకోలేరు. దుగరాజపట్నంలో మేజర్ పోర్టు అనేది ప్రైవేట్, పబ్లిక్ ప్రాపర్టీ విధానంలో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నామంటున్నారు. ఇది వాస్తవరూపం దాల్చే ప్రాజెక్టు కాదు. ఎయిర్ పోర్టులు కావాలంటే భూములు కావాలంటున్నారు. రాష్ట్రం వద్ద నిధులు లేవు, పేదరికంలో ఉన్నామని చెబుతుంది. మరి ఎలా నిర్మిస్తారు? ఇది పిచ్చికుదిరితే పెళ్లి, పెళ్లి జరిగితేనే పిచ్చికుదురుతుంది అనేలా తయారైంది" అన్నారు పవన్.

  • Loading...

More Telugu News