: ఇంటర్ విద్యార్థిని మరణానికి కేసీఆర్ దే బాధ్యత: షబ్బీర్
ఇంటర్ విద్యార్థిని గాదం నవిత మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. ఫీజులు చెల్లించుకోలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోకూడదంటే తక్షణం రూ. 3 వేల కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో తీవ్ర ఆవేదనకు గురైన నవిత... మంగళవారం నాడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడెగాం గ్రామంలో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతోంది.