: తొలి ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోర్ 537.. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా


ఇంగ్లండ్, భార‌త్‌ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య రాజ్‌కోట్‌లో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచు మొదటి ఇన్సింగ్స్ లో 159.3 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ టీమ్‌ 537 పరుగులకు ఆలౌటయింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ స్టోక్స్ 128 ప‌రుగులు చేయ‌గా, రూట్ 124, అలీ 117 ప‌రుగులు చేశారు. కాగా, కుక్ 21, హమీద్ 31, డకెట్ 13, బైర్‌స్టో 46, వోక్స్ 4, ర‌షీద్ 5, అన్సారీ 32 ప‌రుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీశారు. ఉమేష్‌, షమీ, అశ్విన్‌లకు చెరో రెండు వికెట్లు దక్కగా, అమిత్‌ మిశ్రా ఓ వికెట్ తీశాడు. మొద‌టి ఇన్సింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి విజ‌య్‌, గంభీర్‌లు ఓపెనర్లుగా వ‌చ్చారు. ప్ర‌స్తుతం విజ‌య్ 19 గంభీర్ 11 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు వికెట్ న‌ష్ట‌పోకుండా ప‌ది ఓవ‌ర్ల‌కు 35గా ఉంది.

  • Loading...

More Telugu News