: దేశంలో రాక్షస పాలన కొనసాగుతోంది!: పెద్ద నోట్ల రద్దుపై అజాద్ స్పందన


నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని అరికట్టే క్రమంలో రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ స్పందించారు. ఇప్పటికిప్పుడు ఈ నోట్లను ఎందుకు రద్దు చేశారో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. దీనివల్ల సామాన్యులు ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. వ్యవసాయ రంగం, పెళ్లిళ్లపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. మోదీ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని విమర్శించారు. దేశంలో రాక్షస పాలన కొనసాగుతోందని... నోట్లను రద్దు చేయడమే దీనికి సాక్ష్యమని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని తెలిపారు.

  • Loading...

More Telugu News