: సమూల మార్పు... 5, 10, 20, 50, 100 రూపాయల నోట్లనూ తొలగిస్తాం: శశికాంత్ దాస్
ఇండియాలోని కరెన్సీని సమూలంగా మార్చడంతో పాటు మరిన్ని అదనపు సెక్యూరిటీ ఫీచర్లను జోడించడమే లక్ష్యంగా అన్ని కరెన్సీ నోట్లనూ రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త నోట్లను దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆర్థిక శాఖ వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ దాస్ గుప్తా పలు కీలక విషయాలు పంచుకున్నారు. చలామణిలో ఉన్న అన్ని రకాల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుని, వాటి స్థానంలో కొత్త డిజైన్, ఫీచర్లతో ఉండే కరెన్సీని ప్రవేశపెడతామని తెలిపారు. 5, 10, 20, 50, 100 రూపాయల కొత్త నోట్లు వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరెన్సీ బట్వాడా శరవేగంగా సాగుతోందని, భద్రత నిమిత్తం 3 వేల మంది పారామిలిటరీ, పోలీసు, క్విక్ రియాక్షన్ టీములను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.