: తెలంగాణ సచివాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ సచివాలయం ముందు ఈ రోజు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొత్త సచివాలయ భవన నిర్మాణానికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషనుకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... ఇది ప్రజాస్వామ్య దేశమని, ప్రభుత్వం ఇటువంటి పనులు చేస్తోంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. కేసీఆర్‌కి రైతుల ఆత్మహత్యలు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. సిగ్గు ఉంటే రైతు రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చేయండి.. భవనాలు ఎందుకు? అని షబ్బీర్ అలీ అన్నారు. వాస్తు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఆందోళన నేపథ్యంలో సచివాలయం వద్ద పోలీసులతో షబ్బీర్ అలీ వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యేలను అడ్డుకోవడమేంటని పోలీసులని ప్రశ్నించారు.