: గెలుపు కోసం ములాయం యత్నాలు... కీలక నేతలతో భేటీ


2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో సమాజ్ వాదీ పార్టీ అధినేత, రాజకీయ కురువృద్ధుడు అయిన ములాయం సింగ్ తన సర్వశక్తులను ఒడ్డుతున్నారు. జనతా పరివార్ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో, ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్, జేడీయూ నేత శరద్ యాదవ్ లతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. సీట్ల పంపకాల గురించి వీరు చర్చించినట్టు సమాచారం. ఆర్ఎల్డీకి పశ్చిమ యూపీలో పట్టు ఉంది. బిహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన యూపీ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించాలని జేడీయూ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ పార్టీలకు ములాయం సీట్ల సర్దుబాటు ఎలా చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ములాయం కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త పర్యటనలో బీజీ అయిపోయారు.

  • Loading...

More Telugu News