: ట్రంప్ వ్యతిరేకుల ర్యాలీపై తుపాకులతో విరుచుకుపడ్డ దుండగులు!
ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేని కొందరు అమెరికన్లు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న వేళ కాల్పులు జరగడంతో కలకలం రేగింది. సియాటెల్ లో ట్రంప్ కు వ్యతిరేకంగా ర్యాలీ జరుగుతుంటే, గుర్తు తెలియని దుండగులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరుపగా, పదుల సంఖ్యలో గాయపడినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు, పోలీసు అధికారులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఒకరేనా? లేదా గ్రూప్ గా వచ్చారా? అన్న విషయమై సమాచారం లేదని, విచారణ జరుపుతున్నామని, నిందితుల కోసం గాలింపు ప్రారంభించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అమెరికాలో కాల్పుల ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.