: నరేంద్ర మోదీకి సలహా ఇచ్చింది ఈయనే... దీనికంతా కారణం ఈయనే!


ఇప్పటిదాకా చలామణిలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన పేరు అనిల్ బొకిల్. ఔరంగాబాద్ కు చెందిన ఈయన ఆర్కిటెక్టే కాకుండా చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. ఈ ఏడాది జూలైలో ఈయన ప్రధానిని కలిసి... నల్లధనాన్ని అరికట్టడానికి తన వద్ద ఉన్న సలహాలను పంచుకున్నారు. తొలుత ఆయనకు కేవలం 8 నిమిషాలు మాత్రమే అపాయింట్ మెంట్ లభించింది. కానీ, వీరిద్దరి మధ్య భేటీ ఏకంగా రెండు గంటలకు పైగా కొనసాగింది. లెక్కల్లో చూపించని బ్లాక్ మనీ వల్లే రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని... దీని ప్రభావంతో డబ్బు కూడా తన విలువ కోల్పోతోందనేది అనిల్ భావన. ఈ వ్యవహారానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలనేది ఆయన ఆలోచన. కేవలం పెద్ద నోట్ల రద్దే కాదు... ప్రధానికి ఆయన పలు విషయాలను సూచించారు. ఆయన ప్రతిపాదనలు ఇవే... * పెద్ద నోట్లైన రూ. 500, రూ. 1000లను వెంటనే రద్దు చేయాలి. * ఎక్కువ మొత్తంలో జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకు మార్గంలోనే జరగాలి. డీడీ, ఆన్ లైన్, చెక్కు రూపంలోనే ఇవి ఉండాలి. * నగదు లావాదేవీలకు నిర్దిష్టమైన పరిమితి విధించి... దానిపై పన్ను లేకుండా చూడాలి. * బ్యాంక్ లావాదేవీల పన్ను (కేవలం క్రెడిట్ మీదే) 2 శాతం విధించి... దాని మీదే ప్రభుత్వం ఆదాయం పొందాలి. * దిగుమతి సుంకం మినహా మొత్తం 56 పన్నులను రద్దు చేయాలి.

  • Loading...

More Telugu News