: విజయవాడకు ఫ్లయ్ ఓవర్ కావాలి: నితిన్ గడ్కరీకి చంద్రబాబు వినతి
విజయవాడలో నిత్యమూ అత్యంత బిజీగా ఉండే బెంజ్ సర్కిల్ ప్రాంతంలో వాహన రాకపోకలను సులభం చేసేందుకు ఓ ఫ్లయ్ ఓవర్ ను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం గడ్కరీతో భేటీ అయి, ఏపీలోని రహదారుల పరిస్థితి, అభివృద్ధి చేయాల్సిన రోడ్డు మార్గాల గురించి చర్చించారు. విజయవాడ బైపాస్ రహదారి నిర్మాణంపైనా చర్చించారు. గత నెలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులివ్వాలని కోరారు. అమరావతి ప్రాంతానికి రాయలసీమ నుంచి ప్రతిపాదించిన జాతీయ రహదారుల విస్తరణ పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు కోరగా, అందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.