: మహిళపై మైకు విసిరేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి!


తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఓ మహిళపై, 'సమయం, సందర్భం లేదా?' అంటూ ఆగ్రహంతో ఊగిపోయి, చేతిలోని మైకును విసిరారు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఈ ఘటన జనచైతన్య యాత్రల్లో భాగంగా మూడవ వార్డులోని రవీంద్ర నగర్ బస్టాప్ వద్ద రామకృష్ణ బాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న వేళ జరిగింది. ఈ ప్రాంతంలో జనావాసాల మధ్య సెల్ టవర్ ను ఏర్పాటు చేశారని ఓ మహిళ ఆరోపించారు. గతంలో ఓ సెల్ టవర్ ను తీసి వేయించామని, ఇప్పుడు మీ అండతోనే తిరిగి టవర్ పెట్టారని ఆమె ఆరోపించగా, ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. ఆ సెల్ టవర్ మరో పార్టీ వ్యక్తిదని, తానెందుకు మద్దతిస్తానని చెబుతూ, చేతిలో ఉన్న మైక్ ను విసిరేశారు. ఈ ఘటనతో చుట్టూ ఉన్న తెలుగుతమ్ముళ్లు అవాక్కయ్యారట!

  • Loading...

More Telugu News