: ఇక పెద్ద నోట్లు దాచుకునేందుకు అవినీతిపరులు భయపడతారు.. మోదీ నిర్ణయాన్ని స్వాగతించిన జేపీ


పెద్ద నోట్ల రద్దును లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ స్వాగతించారు. మోదీ నిర్ణయాన్ని అవినీతి యుద్ధంపై ప్రభుత్వం తొలి అడుగుగా భావిస్తున్నట్టు చెప్పారు. అయితే ఇక్కడితోనే ఆగిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. ఇక నుంచి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయన్న ఆయన పెద్ద నోట్లు దాచుకునేందుకు ఇక నుంచి అవినీతిపరులు భయపడతారన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పన్ను తగ్గించాలని కోరారు. రాజకీయ అవినీతికి అడ్డుకట్ట వేయాలని, నఫీమా చట్టాన్ని అమలు చేయాలని జేపీ సూచించారు.

  • Loading...

More Telugu News