: ట్రంపే కాదు.. ఆయన సతీమణిదీ రికార్డే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. రాజకీయంగా ఎటువంటి పదవులు చేపట్టకుండా నేరుగా అమెరికా అధ్యక్షుడైన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయన ఒక్కరే కాదు, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కూడా మరో అరుదైన రికార్డు అందుకోనున్నారు. ట్రంప్ గెలుపుతో అమెరికా ప్రథమ మహిళగా గుర్తింపు పొందనున్న ఆమె ఇలాంటి గుర్తింపు అందుకున్న రెండో విదేశీ మహిళగా రికార్డు నెలకొల్పారు. 1825-1829లో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జాన్స్ క్విన్సీ ఆడమ్స్ భార్య లూసియా మొదటి విదేశీ మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె తల్లి బ్రిటిన్ మహిళ, తండ్రి అమెరికా వాసి. ఆమె తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ ఘనత అందుకుంటున్నది మెలానియానే. మెలానియా 1970లో యుగేస్లేవియాలో జన్మించారు. మోడల్‌గా ఓ వెలుగు వెలిగిన ఆమె 1998లో ట్రంప్‌కు పరిచయమయ్యారు. 2005లో వివాహం చేసుకున్నారు. 2006లో మెలానియాకు గ్రీన్ కార్డు లభించడంతో అమెరికా పౌరసత్వం దక్కింది.