: కోడిగుడ్లు కొనేందుకు బిపాషాబసు అప్పుచేసిందట!


పెద్దనోట్ల రద్దు ప్రభావం బారిన పడని వారు లేరనడం అతిశయోక్తి కాదేమోనిపిస్తోంది. నిన్న రాత్రి ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచే ఎంతో మంది ఎన్నోరకాల ఇబ్బందులు పడ్డారు. ఈ కోవలోకి బాలీవుడ్ బ్యూటీ బిపాషాబసు కూడా వస్తుంది. ఎందుకంటే, పెద్దనోట్లు తప్పా వేరే డబ్బు లేకపోవడంతో కోడిగుడ్లు కొనేందుకు వేరొకరి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకోవాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని బిపాసా స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ‘రాకీ స్టార్ వరల్డ్’ నుంచి డబ్బు అప్పుగా తీసుకుని ఈ కోడిగుడ్లు కొన్నానని చెప్పింది. కాగా, టీవీ నటి మిని మాథుర్ కూడా పెద్దనోట్ల ప్రభావం తమపై ఎంతగా పడిందనే విషయాన్ని అభిమానులతో పంచుకుంది. 'మా కుటుంబం అందరి వద్ద కలిపి మొత్తం రూ.732 మాత్రమే ఉన్నాయి. దీంతో, చిన్నపిల్లలు డబ్బులు దాచుకునే ‘పిగ్గీ బ్యాంక్’ పగలగొట్టాలనుకున్నాము' అని మినీ మాథుర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

  • Loading...

More Telugu News