: మోదీ ‘మాస్టర్ స్ట్రోక్’ లాంటి నిర్ణయం తీసుకున్నారు: ఇన్ఫోసిస్ అధినేత


పెద్దనోట్ల రద్దుపై ప్రధాని మోదీ నిర్ణయాన్ని ‘మాస్టర్ స్ట్రోక్’తో పోల్చారు, ఇన్ఫోసిస్ అధినేత ఎన్.ఆర్. నారాయణమూర్తి. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, నల్లధనం, అవినీతిని రూపుమాపడానికే కాకుండా, డిజిటల్ ఎకానమి దిశగా అడుగులు పడేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి నల్లధనమనేది ఉపద్రవం లాంటిదన్నారు. నిన్న రాత్రి మోదీ ప్రకటన వినగానే, ‘మాస్టర్ స్ట్రోక్’ లాంటి నిర్ణయం తీసుకున్నారనిపించిందన్నారు.

  • Loading...

More Telugu News