: బస్తాలతో తెచ్చి 500, 1000 రూపాయల నోట్లను తగులబెట్టారు


ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. యూపీలోని బారెల్లీ లో ఓ కంపెనీకి చెందిన వర్కర్లు బస్తాలతో 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల కట్టలను తీసుకొచ్చి నిర్మానుష్య ప్రాంతంలో నిప్పుపెట్టారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో... సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాలిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుని ఆర్బీఐ అధికారులకు సమాచారం అందించారు. ఈ నోట్లు వర్కర్లు తెచ్చిన కంపెనీకి చెందినవా? లేక రాజకీయ నాయకులకు చెందినవా? లేక సంఘవ్యతిరేక, విద్రోహశక్తులకు చెందినవా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News