: పెద్దనోట్ల రద్దు నిర్ణయం సమర్థపాలన అందించేందుకు సరిపోదు: జయప్రకాష్ నారాయణ
పెద్దనోట్ల రద్దు నిర్ణయం.. మళ్లీ అవినీతి జరగకుండా, ప్రజలకు సమర్థపాలన అందించేందుకు మాత్రం సరిపోదని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రక్రియ ఒక రాజకీయ గిమ్మిక్కుగా మిగిలిపోకూడదని, అందుకుగాను, ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన, పన్నులు తగ్గింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను డబ్బును ప్రజా సేవ కోసం సద్వినియోగం చేయాలే తప్పా, నాయకుల విలాసాలకు, ఉద్యోగుల జీత భత్యాలను భారీగా పెంచుకునేందుకు వాడకూడదని, ఈ మేరకు సంస్కరణ చేయాలని జయప్రకాష్ నారాయణ సూచించారు. చలామణిలో ఉన్న నోట్లను రద్దుచేసి రూ.500, రూ.2 వేల నోట్లను కొత్తగా తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.