: 2014లో మోదీ గెలుపు, ఇప్పుడు ట్రంప్ గెలుపు ఒకలాంటిదే: సుబ్రహ్మణ్య స్వామి
2014లో మోదీ గెలుపు, ఇప్పుడు ట్రంప్ గెలుపు ఒకలాంటిదేనని బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని తానెన్నడో చెప్పానని, ఆయన గెలిచినంత మాత్రాన భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలేమీ దెబ్బతినవని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ పోరాడుతున్నారని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.