: నేను ఈ జన్మలోనే నలుపు, గత జన్మలో కమల్ కలర్: పేలుతున్న హీరో విశాల్ డైలాగు
‘నేను ఈ జన్మలోనే నలుపు, గత జన్మలో కమల్ కలర్’ అని హీరో విశాల్ అన్నాడు. ఈ మాటలు నిజంగా అన్నవి అనుకుంటే పొరపాటు పడ్డట్టే, ఎందుకంటే, విశాల్ తాజా చిత్రం ‘ఒక్కడొచ్చాడు’ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో విశాల్ చెప్పిన ఆ డైలాగ్ అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సూరజ్ దర్శకత్వం వహించగా, విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది.