: ‘ఈయన మా అధ్యక్షుడు కాదు’ అంటూ ట్రంప్ పై నిరసనలు!


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు అప్పుడే నిరసన సెగలు మొదలయ్యాయి. ఇంకా, అధ్యక్షపీఠం కూడా ఎక్కకముందే, ‘ట్రంప్, మా అధ్యక్షుడు కాదు’ అంటూ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ లో సుమారు రెండు వందల మంది ఆందోళనకారులు నిరసనకు దిగారు. రహదారులను దిగ్బంధించారు. బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ (బీఏఆర్ టీ)ని మూసి వేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఇరవై సంవత్సరాల ఒక యువతిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టి,బీఏఆర్ టీ ను కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారులు మూసివేశారు. మరో సంఘటనలో .. బెర్కిలీలోనూ ట్రంప్ పై నిరసనలు వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News