: ట్రంప్ కు ఒబామా అభినందనలు ..ఆహ్వానం


అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ విజయం సాధిస్తే తీవ్ర నిరాశకు గురవుతానని ప్రకటించిన ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయనను వైట్ హౌస్ కు ఆహ్వానించారు. ఎన్నికల ఫలితాల్లో విజయం ఖరారైన అనంతరం ఒబామా ఫోన్ చేసి ట్రంప్ ను అభినందించారు. వైట్ హౌస్ లో రేపు కలుద్దామంటూ ఆహ్వానించారు. ఈ మేరకు వైట్ హౌస్ అధికార ప్రతినిధి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ చక్కగా మాట్లాడుకున్నారని, భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించుకునేందుకు రావాలని ఒబామా ఆహ్వానించారని తెలిపారు. దీనిని ట్రంప్ క్యాంపెయిన్ మేనేజర్ కెల్లియానె కూడా ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News