: మోదీ నిర్ణయంపై పాజిటివ్ గా స్పందించిన ‘వాషింగ్టన్ పోస్ట్’


నల్లధనాన్ని అరికట్టేందుకుగాను రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై విదేశీ మీడియా స్పందించింది. నల్లధనాన్ని అరికట్టేందుకు భారత్ తీసుకున్న ప్రధానమైన, చాలా పెద్ద చర్య అని విదేశీమీడియా అభివర్ణించింది. నల్లధనం నిరోధానికి ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నారని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొనగా, ఈ నిర్ణయం కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడతారేమోనని బీబీసీ వార్తా సంస్థ పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా, యూకేలోని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రిక కూడా స్పందించింది. నల్లధనాన్ని అరికట్టడానికి భారత్ సుదీర్ఘకాలంగా పోరాడుతుందని, ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం మరో పెద్ద అడుగు అని ఆ పత్రిక పేర్కొంది.

  • Loading...

More Telugu News