: ‘సంగారెడ్డి’కి చేరుకున్న కొత్త నోట్ల కంటెయినర్లు
‘సంగారెడ్డి’లోని ఎస్ బీహెచ్ కి కొత్త నోట్లు వచ్చేశాయి. రెండు కంటెయినర్లలో కొత్త నోట్లను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో కొత్త నోట్లు చలామణిలోకి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు ఈరోజు బంద్ అయ్యాయి. ఏటీఎంలు ఇవాళ, రేపు పనిచేయవని ఆర్బీఐ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.