: నల్లకుబేరులు 'హుండీ' ఆదాయం పెంచుతారా?


500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ నిన్న రాత్రి 8 గంటలకు ప్రకటించారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ నోట్లపై చర్చ నడుస్తుండగా, నల్లకుబేరుల్లో గుబులు రేగుతోంది. లెక్కల్లో చూపని డబ్బును ఎలా మార్చుకోవాలన్నది వారికి పెద్ద సమస్యే. ఈ నేపథ్యంలో నల్లకుబేరులు తమ దగ్గరున్న డబ్బును మార్చుకునేందుకు ఉన్న అవకాశాలపై విశ్లేషకులు చర్చిస్తున్నారు. నల్లధనాన్ని ఇంత ఆకస్మాత్తుగా తెల్లధనంగా మార్చుకోవడం అనేది వారికి కష్టతరమైన పనని అంటున్నారు. అందులో భాగంగా తమ వద్ద మూలుగుతున్న నల్లధనాన్ని చాలామంది తిరుమల వెంకన్న హుండీలో వేసేసే అవకాశం వుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల తమ దగ్గరున్న డబ్బును సద్వినియోగం చేశామన్న తృప్తితో పాటు, పుణ్యం కూడా దక్కుతుందన్న ఆశ కలుగుతుందని అంటున్నారు. ఈ విధంగా రానున్న రోజుల్లో ఒక్క తిరుమలకే కాకుండా వివిధ ప్రముఖ పుణ్య క్షేత్రాలలో దేవుళ్ల హుండీ ఆదాయం పెరుగవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో కూడా ఈ విషయంపై కామెంట్లు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News