: పెద్దనోట్ల రద్దు ప్రభావం: బ్యాంక్ ఆన్‌లైన్ సేవలకు సైతం అంతరాయం
నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న ప్రజలకి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. పెద్ద నోట్లు చలామణిలో లేకపోవడంతో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్న ప్రజలు ఈ రోజు అత్యధికంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లను ఆశ్రయించారు. అయితే, ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో సర్వర్లు మొరాయించాయి. పెద్ద నోట్లు చలామణిలో లేక, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు జరగక వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తాత్కాలికంగా మాత్రమే కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.