: డొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కి గట్టిపోటీనిచ్చిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల కౌంటింగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు హిల్ల‌రీ క్లింట‌న్‌కు 218, రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌కి 289 ఎల‌క్టోర‌ల్ ఓట్లు వచ్చాయి. విజ‌యం సాధించిన ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న‌ ట్రంప్కు టెలిగ్రాం ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ... ట్రంప్ విజ‌యంతో ర‌ష్యా-అమెరికాల మ‌ధ్య ఇప్పటికైనా ద్వైపాక్షిక స‌త్సంబంధాలు మరింత మెరుగ‌వుతాయ‌ని తాను ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రపంచం నుంచి ఎదుర‌వుతున్న‌ సవాళ్లను అధిగ‌మించ‌డానికి అమెరికాతో కలిసి ముందుకు సాగాలని తాము కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. మ‌రోవైపు రష్యా అధ్య‌క్షుడే కాక‌, ఆ దేశంలోని ప్ర‌ధాన పార్టీలన్నీ ట్రంప్కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News