: ప్రతి అమెరికన్ కి నేనే అధ్యక్షుడిని... విజయానంతరం డొనాల్డ్ ట్రంప్ కీలక ఉపన్యాసం


అమెరికన్లు అందరూ ఒకే తాటిపైకి రావల్సిన సమయం ఆసన్నమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రతి అమెరికన్ కు ఇక నుంచి తానే అధ్యక్షుడినని చెప్పారు. అమెరికాకు పూర్వ వైభవం తెస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థికంగా అమెరికాను అగ్రస్థానంలో నిలబెడతానని... అమెరికా అభివృద్ధి రేటును రెండింతలు చేస్తానని ట్రంప్ తెలిపారు. కష్టపడి పనిచేస్తే, ఏ కల అయినా సార్థకమవుతుందని అన్నారు. మాజీ సైనికులకు అండగా నిలుస్తానని చెప్పారు. ఇన్నాళ్లు మహిళలు, నల్లజాతీయులను తక్కువగా చూశారని... ఇకపై ఆ పరిస్థితి ఉండదని అన్నారు. దేశాన్ని తాను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పారు. అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత ట్రంప్ కీలక ఉపన్యాసం చేశారు. తన మద్దతుదారులు, కుటుంబసభ్యులంతా పక్కనుండగా... తన దేశాన్ని, ప్రపంచాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్నిటికన్నా ముందు తన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. తన తల్లిదండ్రుల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. తన కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలిపారు. తన విజయం కోసం తపించిన వారందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇచ్చారు.

  • Loading...

More Telugu News