: తొలగిన ఇబ్బందులు... టోల్‌ప్లాజాల వద్ద 500, 1000 రూపాయల నోట్లకు అనుమతి
నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద పెద్ద నోట్లను స్వీకరించకపోవడంతో వాహనదారులు తీవ్ర కష్టాలు ఎదుర్కుంటున్నారు. జాతీయ రహదారులపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండడం, సిబ్బందితో వాగ్వివాదానికి దిగడం పట్ల స్పందించిన భారత జాతీయ రహదారుల సంస్థ ఛైర్మన్ వాహనదారులకు సానుకూల ప్రకటన చేశారు. ఈ నెల 11 అర్ధరాత్రి వరకు 500, 1000 నోట్లను స్వీకరించాలని టోల్‌ప్లాజా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.