: విజయం అనంతరం హిల్లరీని ప్రశంసించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా హిల్లరీని ఆయన ప్రశంసించారు. ఎన్నికల్లో విజయం కోసం ఆమె ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. హిల్లరీ క్లింటన్ ఇప్పుడే తనకు ఫోన్ చేశారని... తనను అభినందించారని చెప్పారు. ఆమెకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. అమెరికా మనదని.. అందరం అమెరికా కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు.