: ట్రంప్ విక్టరీ కేక్ ఇదిగో.. మీరూ చూడండి!


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం దిశగా ట్రంప్ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో, హిల్లరీ శిబిరం నిరాశలో కూరుకుపోయింది. మరోవైపు, ట్రంప్ శిబిరంలో అప్పుడే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అంతేకాదు, ఆయన అభిమాని ఒకరు ట్రంప్ రూపంలో కేకును తయారు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అతి తక్కువ సమయంలోనే ఈ ఫొటో వైరల్ అయింది. మెలిస్సా ఆల్ట్ అనే కేక్ డెకొరేటర్ ఈ కేక్ ను తయారు చేసింది. దీని కోసం ఆమె దాదాపు 50 గంటల పాటు శ్రమించింది. అయితే, గెలుపు సమయంలో ట్రంప్ మొహంలో ఆనందం కాకుండా, విచారం కనిపిస్తోందంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News