: వరంగల్ ఏటీఎం సెంటర్ల వద్ద నోట్ల వ్యాపారం


వరంగల్ లోని ఏటీఎం సెంటర్ల వద్ద నోట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నిన్న అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించడంతో... ఏటీఎంలలో చాలా మంది డబ్బులు డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత ఏటీఎం కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో, రూ. 100కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు నోట్ల మార్పిడి వ్యాపారానికి తెరతీశారు. రూ. 500కు రూ. 100 కమిషన్ తీసుకుని రూ. 400 తిరిగి ఇస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో జనాలు రూ. 400లే తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News