: ఊహించని షాక్‌తో హిల్లరీ క్లింటన్ మద్దతుదారుల్లో టెన్షన్.. టెన్షన్!
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు లేవని ఎన్నో సర్వేలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సర్వేలతో పాటు ప్రజలు ఊహించని రీతిలో విజయం దిశగా ట్రంప్ పయనిస్తుండడంతో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వర్గీయుల్లో టెన్షన్ నెలకొంది. హిల్లరీ క్లింటన్‌దే గెలుపని ఎన్నో సర్వేల్లో తేల్చిచెప్పడంతో విజయం తమదేనని అనుకున్న ఆమె మద్దతుదారులు ఇప్పుడు కంగుతింటున్నారు. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించడం, అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశాలు ట్రంప్‌కే ఎక్కువవుతుండడంతో హిల్లరీ క్లింటన్ మద్దతుదారుల మొహాల్లో నిరాశ కనిపిస్తోంది. మరోవైపు ట్రంప్ వర్గీయుల్లో ఆనందం అంబరాన్ని తాకుతోంది. విజయగర్వంతో సంబరాలు చేసుకోవడమే తరువాయి అన్నట్లుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.