: పోలీసులకు చిక్కిన ప్రొఫెసర్ లక్ష్మి కుమారుడు, కుమార్తె


గైనకాలజీ స్టూడెంట్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మి ఇంకా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నప్పటికీ, ఆమె కుమారుడు, కుమార్తెను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ సాయంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, లక్ష్మి గురించిన సమాచారం కోసం వారిని విచారిస్తున్నారు. కాగా, లక్ష్మి కోర్టులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనున్న సంగతి తెలిసిందే. తీర్పు ఆమెకు అనుకూలంగా రాకపోవచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News