: తన రాజకీయ శత్రువుని ప్రశంసించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్


రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి బద్ధ శత్రువుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను చెప్పుకోవచ్చు. సాధారణ ఎన్నికల సమయంలో మోదీని బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు... ఎన్డీఏ కూటమి నుంచి కూడా నితీష్ బయటకు వచ్చేశారు. అలాంటి నితీష్ కుమార్ ప్రధాని మోదీని ప్రశంసించారు. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని ఆయన అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. నల్లధనాన్ని అరికట్టే క్రమంలో ఈ నిర్ణయం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News