: రాజ్ కోట్ టెస్ట్... తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
రాజ్ కోట్ లో భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద ఓపెనర్ కెప్టెన్ కుక్ జడేజా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 47 బంతులను ఎదుర్కొన్న కుక్ 2 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు వికెట్ నష్టానికి 62 పరుగులు. మరో ఓపెనర్ హమీద్ 31 పరుగులతో, రూట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.