: శభాష్ మోదీ... ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తిన బాలీవుడ్ ప్రముఖులు
నల్లధనాన్ని అరికట్టే క్రమంలో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి సామాన్యులు నీరాజనాలు పడుతున్నారు. మరోవైపు, సినీ ప్రముఖులు కూడా మోదీకి హాట్సాఫ్ చెబుతున్నారు. ఎవరెవరు ఏమన్నారో ఓ లుక్కేద్దాం. రజనీకాంత్: మోదీకి జేజేలు. నవీన భారతం ఆవిర్భవించింది. జై హింద్. అబితాబ్ బచ్చన్: మా 'పింక్' సినిమా కారణంగానే రూ. 2000 నోటును పింక్ కలర్ లో ముద్రిస్తున్నారు. దర్శకనిర్మాత మధుర్ భండార్కర్: మోదీకి అభినందనలు. ఆయన నిర్ణయంతో నల్లధనం వెలికి వస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. నటుడు పరేష్ రావల్: మోదీ నిర్ణయంతో రూ. 500, రూ. 1000 నోట్లు బయటపడక తప్పదు. నల్లధనం దాచిన వారు వెలుగులోకి వస్తారు. హీరో అర్జున్ కపూర్: ఈ మార్పును ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హీరో సునీల్ షెట్టి: ప్రధాని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 9/11 రోజున కొంత మంది ఓడిపోతారు... కానీ, ఎంతో మంది గెలుస్తారు. హీరోయిన్ అనుష్క శర్మ: ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు అందరూ సహకరించాలి.