: పాతాళానికి జారిపోయిన భారత స్టాక్ మార్కెట్


భారత స్టాక్ మార్కెట్ బుధవారం నాటి సెషన్ ఆరంభంలోనే భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రానున్నారన్న వార్తలతో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించింది. దీంతో స్టాక్ మార్కెట్ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి కూరుకుపోయింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 1700 పాయింట్లకు పైగా నష్టంలో నిలిచింది. ఆపై 9:25 గంటల సమయంలో కాస్తంత తేరుకుంది. ప్రస్తుతం 1000 పాయింట్లకు పైగా నష్టంలో నడుస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 26,588 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 374 పాయింట్లు పడిపోయి 4 శాతానికి పైగా నష్టంలో సాగుతోంది. నిఫ్టీ -50లోని అన్ని కంపెనీలూ నష్టాల్లోనే ఉన్నాయి. ఒక్కో కంపెనీ 5 నుంచి 9 శాతం వరకూ నష్టపోయి సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News