: లీమన్ బ్రదర్స్ ను మించిన బ్లడ్ బాత్... ప్రీ ట్రేడింగ్ సెషన్ లో 1300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్


యూఎస్ ఎన్నికల్లో ట్రంప్ విజయం దిశగా సాగుతున్నారని వస్తున్న ఫలితాల సరళితో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఘోరంగా దెబ్బతింది. ఈ ఉదయం ప్రీమార్కెట్ ట్రేడింగ్ సెషన్ లో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 1339 పాయింట్లు పడిపోయి 4.86 శాతం నష్టంతో 26,251.38 వద్ద నిలిచింది. 2008లో లీమన్ బ్రదర్స్ దివాలా వార్త తెలిసిన నాడు కూడా మార్కెట్ ఇంతలా పతనం కాలేదు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లు సైతం నాలుగు శాతం మించి నష్టపోయాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ ప్రీ ట్రేడింగ్ సెషన్ లో 476 పాయింట్లు పడిపోయి 5.57 శాతం నష్టంతో 8,067 పాయింట్లకు దిగజారింది.

  • Loading...

More Telugu News