: ఏక్ దిన్ కా సుల్తాన్!.. వంద నోటు ఉన్నోడే హీరో!


తీసుకెళ్లేందుకు అనువుగా ఉంటుందని ఇన్నాళ్లూ పెద్ద నోట్లపై మక్కువ పెంచుకున్న వారు ఇప్పుడు ‘చిన్న నోటు ఉంటే ఎంత బాగుండునో’ అని అనుకుంటున్నారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగే ప్రతీ చోటా చిన్న నోట్లు ఇచ్చే వారిని ఇప్పటివరకూ వింతగా చూసేవారు. ‘కాస్త పెద్దనోట్లు ఉంటే తీసుకు రావచ్చుగా’ అనే నిష్ఠూరపు మాటలూ వినిపించేవి. అయితే, మంగళవారం రాత్రి నుంచి పరిస్థితి ఒక్కసారిగా పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది. ప్రభుత్వ ప్రకటనతో వంద నోటు ఉన్నవాడు రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు. రాత్రి నుంచి ఏ అవసరానికి బయటకు వెళ్లినా ‘వంద నోటు ఉంటే ఇవ్వొచ్చుగా’ అన్న మాటలే వినిపిస్తున్నాయి. కొత్తనోటు చలామణిలోకి వచ్చే వరకు వందనోటు దగ్గరున్నవాడే సూపర్ హీరో. మరోవైపు ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే ప్రధాన నగరాల్లోని ఏటీఎం సెంటర్లన్నీ కిటకిటలాడాయి. కొందరు వందనోటు కోసం వస్తే మరికొందరు తమ వద్ద ఉన్న పెద్దనోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ఎగబడ్డారు. పెద్ద ఎత్తున బారులు తీరిన జనాలను అదుపు చేయలేక చాలాచోట్ల ఏటీఎంలను బంద్ చేశారు. పెద్ద నోట్లు ఉన్నవారు ఇప్పటికిప్పుడు వాటిని మార్చుకునే అవకాశం లేదు. సో.. ఇప్పుడు హీరో వందనోటున్నవాడే!

  • Loading...

More Telugu News