: నాన్నకు ఓటేశానంటూ సోషల్ మీడియాకు ఎక్కి పెద్ద తప్పు చేసిన జూనియర్ ట్రంప్


అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న వేళ, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ శిక్షార్హమైన తప్పు చేశాడు. తన తండ్రికి ఓటేస్తూ, బ్యాలెట్ పేపర్ ను ఫోటో తీయడమే కాకుండా, దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం పెను సంచలనాన్ని కలిగించింది. తన తండ్రికి ఓటేశానని, దేశ ఉజ్వల భవిష్యత్ కు ఆయన కృషి చేయనున్నారని ట్వీట్ పెట్టారు. న్యూయార్క్‌ రాష్ట్ర నిబంధనల ప్రకారం ఎవరికి ఓటు వేశామో ప్రకటించడం చట్ట వ్యతిరేకం. ఆపై తప్పు తెలుసుకున్న ఎరిక్ ట్రంప్ ఆ ట్వీట్ ను తీసివేసినప్పటికీ, ట్రంప్‌ తనయుడిపై అధికార వర్గాలు ఎలాంటి చర్య తీసుకుంటాయన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News